- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి డీ.ఎం.హెచ్.ఓగా వసంతరావు
by Taduka Kalyani |
సంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ గా డాక్టర్ ముదిలి వసంతరావు నూతనంగా బాధ్యతలను స్వీకరించనున్నారు

X
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ గా డాక్టర్ ముదిలి వసంతరావు నూతనంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టియానా పదోన్నతి పొందిన పలువురు వైద్యాధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ ఇంచార్జ్ డిఎంహెచ్వో గా బాధ్యతలు చేపట్టిన నాగ నిర్మల సంగారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్వో గా తన విధులను కొనసాగిస్తారు. అయితే గతంలో జిల్లా డీఎంహెచ్వోగా ఉన్న గాయత్రీ దేవి హైదరాబాద్ పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రి ఆర్ఎంఓగా బదిలీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న వసంతరావు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోగా ఆరు నెలల పాటు పనిచేస్తూ తాజాగా సంగారెడ్డి జిల్లాకు బదిలీపై రానున్నారు. గతంలో ఈయన సిరిసిల్ల డిఎంహెచ్వోగా కూడా పనిచేసినట్లు ఆయన దిశ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు.
Next Story






