రసాభాసగా వర్గల్ గ్రామసభ

by Batti.Sumithra |

సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలో నిర్వహించిన గ్రామ సభ మరోసారి ఉద్రిక్త వాతావరణంలో రసాభాసగా మారింది.

రసాభాసగా వర్గల్ గ్రామసభ
X

దిశ, వర్గల్ : సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలో నిర్వహించిన గ్రామ సభ మరోసారి ఉద్రిక్త వాతావరణంలో రసాభాసగా మారింది. ప్రజా సమస్యల పై చర్చించాల్సిన వేదిక, రాజకీయ ఆరోపణలు – ప్రతియారోపణలకు కేంద్రబిందువుగా మారడంతో సభగందరగోళంగా ముగిసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి పై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో పరిస్థితి అదుపు తప్పేలా మారింది.

కొంతసేపు సభ నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. గ్రామంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాల పై చర్చ జరగాల్సిన సమయంలో నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం స్థానిక ప్రజలను నిరాశకు గురి చేసింది. గ్రామస్తులు సమస్యలు వివరించడానికి ప్రయత్నించినప్పటికీ, నాయకుల మధ్య తలెత్తిన వాగ్వాదంతో వారి స్వరం వినిపించకుండా పోయింది.

Next Story