- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'అమృత్ భారత్' స్టేషన్ గా వడియారం రైల్వే స్టేషన్ : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
అమృత్ భారత స్టేషన్ గా చేగుంట మండల కేంద్రంలోని వడియారం రైల్వే స్టేషన్ ఎంపికైందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

దిశ, చేగుంట : అమృత్ భారత స్టేషన్ గా చేగుంట మండల కేంద్రంలోని వడియారం రైల్వే స్టేషన్ ఎంపికైందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి పలు అంశాలపై వినతి పత్రాలను అందించగా వడియారం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ గా నవీకరిస్తున్న నేపథ్యంలో చేగుంట మండల కేంద్రంలోని వడియారం రైల్వే స్టేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేశారు. రాష్ట్రానికి మంజూరైన ఒకే ఒక్క అమృత భారత్ రైల్వే స్టేషన్ ను దుబ్బాక నియోజకవర్గంలోని వడియారం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయించేలా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా మెదక్ నుంచి చేగుంటకు వచ్చే రహదారిపై ఉన్న రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణం కోసం 2018 నుంచి పలు దఫాలుగా రైల్వే మంత్రులకు వినతి పత్రాలు అందించగా ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించి ఆర్వోబీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రైల్వే బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినా సరే.. ఇవ్వకున్నా సరే.. అని రైల్వే మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. మెదక్ రైల్వే స్టేషన్ నుంచి దూర ప్రాంతాలైన తిరుపతి, చెన్నై, బెంగళూరుకు రైలు సర్వీసులు నడపాలని విన్నవించగా సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నట్లు ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వడియారం రైల్వే స్టేషన్లో గతంలో ఎక్స్ ప్రెస్ రైలు ఆగేవి కావని ఎంపీగా గెలిచిన తర్వాత అజంతా ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేయించినట్లు ఎంపీ తెలిపారు.






