- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉట్టి కొట్టి.. డీజే పాటలకు మాస్ స్టెప్పులు.. జగ్గారెడ్డి జోషే వేరు
సంగారెడ్డిలో ఘనంగా హొలీ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పాత బస్టాండ్ రాంమందిర్ వద్ద ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డిలో ఘనంగా హొలీ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పాత బస్టాండ్ రాంమందిర్ వద్ద ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. తన అభిమానులకు, కార్యకర్తలకు రంగులు పూస్తూ సంబరాలు జరుపుకున్నారు. జగ్గారెడ్డికి రంగులు పూసి మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు. హొలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డప్పు కొట్టి మిత్రులు, అభిమానులతో కలిసి జగ్గారెడ్డి డాన్స్ చేశారు.
డీజె టిల్లు పాటకు అభిమానులతో కలిసి జగ్గారెడ్డి మాస్ స్టెప్పులు లేశారు. ప్రజలను ఉత్సాహంగా గడపాలని సూచించారు. అదే విధంగా గురువారం రాత్రి కాముని దహనం కార్యక్రమంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, కూన సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






