- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో అకాల రాళ్ల వర్షం
హుస్నాబాద్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది.

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు కోసం ఆరబోసిన వేలాది క్వింటాళ్ల ధాన్యం ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానకు తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానాలు, జిపిఆర్ఎస్ సాంకేతిక సాకులతో అధికారులు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవుతుంటే అన్నదాతలు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నిబంధనలు పక్కన పెట్టి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని రవీందర్ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.






