ఘోర మోసం.. నాగల్ గిద్ద లో ‘పేరు లేని’ వెంచర్ల నయా దందా!

by Malleboina Mahesh |

నాగల్ గిద్ద మండలంలో అక్రమ లేఅవుట్ల జోరు.. గొందేగావ్, వల్లూరులో అనుమతులు, రోడ్లు లేని ప్లాట్లు అంటగడుతూ రియల్టర్ల దందా.. బాధితుల ఆవేదన!

ఘోర మోసం.. నాగల్ గిద్ద లో ‘పేరు లేని’ వెంచర్ల నయా దందా!
X

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్ గిద్ద మండలం లో అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మకై మోసం చేస్తున్నారు. అధికారికంగా ఒక ఎకరాల్లో వెంచర్ వేయాలంటే 40 సెంట్లు ప్రజాహిత కార్యక్రమాలకు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ సమీపంలో సెంటు భూమి విలువ రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రాంతాన్ని బట్టి ఉంది. సెంటు కనీస విలువ ఐదు లక్షలు పలికినా దాదాపు రూ. 2 కోట్లు విలువైన స్థలం ప్రజాహిత కార్యక్రమాలకు కేటాయించాలి. ఈ తతంగం ఎందుకని రియల్టర్లు ఇష్టా రాజ్యంగా లేవట్లు వేస్తున్నారు. అధికారుల కక్కుర్తి, ప్రజా ప్రతినిధుల అండదండలతో నాగల్ గిద్ద మండలంలో వీటి సంఖ్య గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి చిల్లు పడటమే కాకుండా స్థలాలు కొనుగోలు చేసే వారిపై అదనపు భారం పడుతుంది. అనధికార వెంచర్లు వేశారు. భేటీ క్రమదీకరణ కు సర్కారు అవకాశం ఇచ్చిన పట్టించుకోవడం లేదు.

పేరు లేని వెంచర్ను ఏర్పాటు చేసి గొందేగౌవ్ 30 ఎకరాలు, వల్లూరు 27 ఎకరాలు పంచాయతీ అధికారులు పదేపదే తాఖీదులు ఇచ్చిన చలనము లేదు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోలేక పోతున్నారు.ఆంధ్రాకు చెందిన కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్ ప్రసాద్ ఎక్కడ బోర్డులు ఏర్పాటు చేయకుండా పేరు లేకుండానే ప్లాట్లను విక్రయిస్తున్నారు. రైతులను నమ్మించి వారి వద్ద ముందు ఒకటి రెండు ఎకరాలు అగ్రిమెంట్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అమ్ముడు పోయిన కొద్ది భూమిని తీసుకుని ప్లాట్లు వేసి అమాయకులను అంటగట్టుతున్నారు.పేరు మాత్రమే ఉంది గాని ఎక్కడ బోర్డులు ఉండకుండా దొంగచాటుగా హైదరాబాద్ నుంచి కస్టమర్లకు రప్పించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చెప్పి ప్లాట్లు అంటగట్టారు తున్నారు.

పేరు లేని వెంచర్ పరిస్థితి ఇది..

నాగల్ గిద్ద మండలం గొందేగౌ వ్ గ్రామంలో బీసీలకు సంబంధించిన 30 ఎకరాల భూమి, వల్లూరు గ్రామంలో 27 ఎకరాలు ఎస్సీల సంబంధించిన భూమి తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారు. ఈ వెంచర్ కు రోడ్డు లేకపోవడం తో పక్క వెంచర్ లోపలి నుంచి హైదరాబాదు నుంచి కస్టమర్లను తీసుకొచ్చి తక్కువ ధరకు అని కొనుగోలు చేసి అమాయకులకు అంటగట్టి మోసం చేస్తున్నారు. మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు అమాయకులకు ఆసరు చేసుకుని తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి అమ్ము మోసం చేస్తున్నారు. గొందేగావ్ ప్లాట్లు వేసి అమ్ముకున్నప్పటికీ అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ఎక్కడ ఏ ప్లాట్లు ఉన్నాయో తెలియక తికమక్కపడుతూ అమాయకులు మోసపోయామని రెవెన్యూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.

అనుమతులు లేని ప్లాట్లు.. కొంటే పాట్లు..

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో అనుమతులు లేకుండా కొందరు వెంచర్లను ఏర్పాటు చేసి మాయమాటలతో అన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన వారు గృహ నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గొందేగౌవ్ , వల్లూరు శివార్ ప్రాంతాల్లో వెంచర్లకు అనుమతులు లేకుండా ఉన్నాయి అంటూ, వస్తాయంటూ హద్దురాలు చూపి ఆఫర్లు, తక్కువ ధరల పేరుతో అంటగడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న, ప్రజలు మోసపోతున్నారని తెలిసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారని, అందుకే వారిపై చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

గ్రామాల్లో ఎకరం స్థలం వరకు పంచాయతీ అనుమాతులతో లేఅవుట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతకు మించితే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ( డీటీసీ పీ) అనుమతులు తీసుకోవాలి. కానీ కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొనుగోలుదారులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించడం లేదు. అక్రమ వెంచర్లలో నిర్మాణాలకు అనుమతులు రాక యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాల ఏర్పాటు ఉండడం లేదు. అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టలేక పోతున్నారు. వాటిని అమ్మ లేక, ఉంచుకోలేక అవస్థలు పడుతున్నారు. అందుకే కొనుగోలుకు ముందు లే అవుట్ ఉందా, రోడ్డు, డ్రైనేజీ, వంటి మౌలిక వసతులు పూర్తి చేశారా లేదా తదితర వివరాలన్నీ తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Next Story