అనుమతులు లేని వెంచర్‌లో యథేచ్ఛగా విక్రయాలు.. శ్రీనిధి నియోసిటీలో మోసాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-03 02:43:05  IST  )

ప్రపంచస్థాయిలోనే గుర్తింపు పొందినట్లు శ్రీనిధి నియో సిటీ ప్రజలను తప్పుదోవపట్టిస్తోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్లో పనులను ప్రారంభించడంతో పాటు రోడ్లు, హార్స్ స్టార్చ్ ఏర్పాటు చేసింది.

అనుమతులు లేని వెంచర్‌లో యథేచ్ఛగా విక్రయాలు.. శ్రీనిధి నియోసిటీలో మోసాలు
X

దిశ, సంగారెడ్డి: అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ప్లాట్ల వ్యాపారం సాగుతోంది. వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తున్న రియల్టర్లు, మాయమాటలు చెప్పి, అందమైన బ్రోచ ర్లు చేతిలో పెట్టి, గజాల చొప్పున భూమిని విక్రయిస్తున్నారు. నాలా కన్వర్షన్ 10ఎకరాల్లో తీసుకుని 99ఎకరాల్లో విల్లా ఫ్లాట్లు అంటూ మాయమాటలతో విక్రయాలు సాగిస్తున్నారు. ఇదంతా సదాశివపేట మండల పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీనిధి నియో సిటీ పేరుతో వెంచర్ వెలిసింది. ఎలాంటి అనుమతులు లేవు. రేరా, హెచ్ఎండీఏ లేవుట్ అప్రూవల్ లేదు, భూమికి నాలా కన్వర్షన్ లేదు. కానీ యథేచ్ఛగా ప్లాట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ వెంచర్ యాజ మాన్యం సదాశివపేటలో సర్వే నంబర్ 694, 702, 703, 704, 705, 706, 707, 708, 709, 711, 712లలో 10ఎకరాల భూమి మాత్రమే రిజిస్ర్టేషన్ వెంచర్ యాజమాన్యంపై ఉంది. కానీ.. 99ఎకరాల్లో ప్లాట్లు విక్రయిస్తున్నామని ప్రచా రం చేస్తున్నారు. అతితక్కువ ధరకు విక్రయిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఊదర గొడుతున్నారు.

నాలా కన్వర్షన్, అనుమతులు నిల్..

పూర్తి ‌స్థాయిలో నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములను వెంచర్లుగా చేస్తున్నా రు. వెంచర్ ఏర్పాటుకు తప్పనిసరిగా రేరా, ఎల్.పీ నంబర్, హెచ్ఎండీఏ అనుమతులు ఉండాలి. కానీ.. అవేమి చేయకుండానే వ్యవసాయ భూములను నేరుగా గజాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. ప్రపంచస్థాయిలోనే గుర్తింపు పొందినట్లు శ్రీనిధి నియో సిటీ ప్రజలను తప్పుదోవపట్టిస్తోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్ లో పనులను ప్రారంభించడంతో పాటు రోడ్లు, హార్స్ స్టార్చ్ ఏర్పాటు చేసింది. అనుమతులు లేకుండా తాటికాయంత అక్షరాలతో శ్రీనిధి నియో సిటీ అంటూ బోర్డులు పెట్టినా రెవెన్యూ అధికారులు ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదు. హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులకు ఆ బోర్డులు, రిజిస్ట్రేషన్లు, ప్రచారాలు కనిపించడం లేదు. ఏయే సర్వే నంబర్లు కన్వర్షన్ అయ్యాయో రెవెన్యూ అధికారులకు తెలిసినా విక్రయాలు సాగుతున్నాయి. ఎవరికి కావాల్సింది వారు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో అది వ్యవసాయమా, వ్యవసాయేతరమా? అన్న కోణంలో చూడాల్సి న అవసరం కూడా అధికారులకు లేకుండాపోయింది. దీన్ని, ఆసరాగా చేసుకొని ప్లాట్ల దం దా యథేచ్ఛగా సాగుతోంది.

ఓ విడిది కావాలా..? తక్కువ ధరకే ఇస్తాం

నగరానికి అత్యంత సమీపంలో ఎంజాయ్ చేయడానికి మీకో విడిది కావాలి. అది మేం తక్కువ ధరకే అందిస్తున్నాం..! తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటూ అండర్ ఎలక్ట్రిసిటీ కేబు లింగ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ ఫూల్ ఉంటుం ది. ఎక్కడో కాదు.. సదాశివపేట ప్రాం తంలో ఇంకెందుకు ఆలస్యం? వచ్చేయ్యండి. ప్లాట్ బుక్ చేయండి. అంటూ ప్రచారం ఇది..అందమైన బ్రోచర్లు.. కనువిందు చేసే ప్రాజెక్టు వీడియోలతో కండ్ల ముందు కలల ప్రపంచాన్ని చూపిస్తున్నారు. క్లబ్ హౌజ్ లు, ఫామ్ ప్లాట్ లు, ధ్యాన కేంద్రాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ విల్లా ప్లాట్ల పేరిట దగా చేస్తు న్నాయి. అనుమతుల్లేకున్నా విక్రయాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి వీకెండ్ వెంచర్లలో షామియానాలు వేసి నానా హంగామా చేస్తున్నారు. వాటిని చూసేందుకు హైదరాబాద్, పటాన్ చెరు పరిసర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో కస్టమర్లను తీసుకెళ్తున్నారు. మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు.

Next Story