గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

by Ratna Kumari |

దిశ, బెజ్జంకి : బెజ్జంకి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ శంకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తన్నపేట గ్రామానికి

గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
X

దిశ, బెజ్జంకి : బెజ్జంకి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ శంకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తన్నపేట గ్రామానికి చెందిన కనగండ్ల అజయ్, సోమవారం పేట మండలం ఇల్లంతకుంట గ్రామానికి చెందిన తడకపల్లి శేఖర్ గంజాయి సేవిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇరువురి పై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినంత తెలిపారు. కనగండ్ల అజయ్ బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో 2022లో గాంజా కేసులో అరెస్టు అయ్యాడు. ఆ స‌మ‌యంలో జైలు శిక్ష అనుభవించాడు. తడకపల్లి శేఖర్ పై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో 3గంజాయి కేసులున్నాయి.

Next Story