పేకాటలో చిక్కిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

by Chintha Aamani |

పేకాటలో పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుళ్లను మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పేకాటలో చిక్కిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్
X

దిశ, మెదక్ ప్రతినిధి : పేకాటలో పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుళ్లను మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ పట్టణంలోని వెంకట్రావు నగర్ కాలనీలో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేసి 12 మంది పై కేసు నమోదు చేశారు. దాడిలో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్ళు అంజనేయులు, సురేష్ లు కూడా పట్టుబడ్డారు. దీంతో శాఖ పరమైన చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Next Story