- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెకింగ్ అధికారిపై చెప్పుతో దాడి.. కండక్టర్‌పై కేసు నమోదు
చెకింగ్ అధికారిపై దాడి చేసిన కండక్టర్‌పై రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

దిశ, రాయికోడ్: మహిళా ఉచిత బస్సు సౌకర్యంలో జీరో ఏంహెచ్ సీ టికెట్ ఇచ్చి ప్రయాణికుడి నుంచి రూ.20 వసూలు చేసిన కండక్టర్‌కు చార్జి మెమో ఇస్తుండగా.. టిటిఐపై చెప్పుతో దాడి చేసినట్లు రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ తెలిపారు. టిటిఐ పెద్దదొడ్డి యేసయ్య, తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మే 1 శుక్రవారం ఉదయం 6 గంటలకు విధుల్లో భాగంగా యేసయ్య టిటిఐ పీ ప్రకాష్, జిప్ డ్రైవర్ జే ప్రతాప్‌తో కలిసి తనిఖీలు చేశారు. ఝరసంఘం మండలం కప్పడ్ వద్ద ఉదయం 8:30 గంటలకు TG15Z0082 నెంబర్ గల నారాయంఖేడ్ డిపో బస్సును తనిఖీ చేశారు.
కండక్టర్ పై కేసు నమోదు..
అందులో కండక్టర్ డి వసంత్ తండ్రి కిషన్ 37 సర్వీస్ నెం.. 801981ఒక ప్రయాణికుడి నుంచి ఛార్జ్ తీసుకొని జీరో ఏంహెచ్ సీ టికెట్ ఇచ్చినట్లు గుర్తించారు. దీనిపై చార్జి మెమో జారీ చేయగా కండక్టర్ సంతకం చేయకుండా రెచ్చగొట్టి, ప్రయాణికులతో కలిసి టిటిఐపై చెప్పులతో దాడి చేశాడని తెలిపారు. ఈ ఘటనలపై ఎంటిడి 353 నంబర్ గల ఒరిజినల్ ఛార్జ్ మెమో బుక్కును జీరో ఏంహెచ్ సీ టికెట్ నెం.. 20192 A575350 ను చించివేసి గొడవ చేసి టిటిఐ యేసయ్య ఎడమ చేతిపై, ప్రకాష్ నుదుటిపై దాడి చేసి గాయాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు టిటిఐ ఫిర్యాదు మేరకు కండక్టర్ డి వసంత్‌పై రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






