- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఝరాసంగం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆధ్వర్యంలో బుధవారం ఝరాసంగం, కొహిర్, న్యాల్ కాల్, మొగుడం పల్లి, జహీరాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వివిధ మండలాల అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బీజేపీ నేడు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడటం తెలంగాణ సమాజాన్ని కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ ఎజాజ్ బాబా, తదితరులు పాల్గొన్నారు.






