- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ట్రీట్‌మెంట్.. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ శ్రీధర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ శ్రీధర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై ఆగిపోయి, రోగులు ఇబ్బంది పడినట్లు, సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించినట్లు వచ్చిన వార్తపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, టీవీవీపీ కమిషనర్ ఘటనపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పవర్ కట్ సమయంలో జనరేటర్లు ఆన్ చేయకుండా ఆలస్యం చేసినట్లుగా విచారణలో తేలడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరోసారి అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు






