కాలకృత్యాలు వెళ్లి.. వ్యక్తి మృతి.. ఇంతకీ ఏమైనట్టు.. ?

by Naveena |

ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతి చెందాడు.

కాలకృత్యాలు వెళ్లి.. వ్యక్తి మృతి.. ఇంతకీ ఏమైనట్టు.. ?
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సాయి నగర్ కాలనీలో నివాసముంటున్న దానయ్యల ఆంజనేయులు గౌడ్ (48) కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడికి ఓ భార్య ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఈ నెల 10వ తేదీన తన కూలి పని డబ్బులు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి..తన సైకిల్ పై బయటకు వెళ్ళాడు. అదే రోజు మద్యం మత్తులో శారద హాస్పిటల్ సమీపంలో ఉన్న పెద్ద మురికి కాలువలో కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లి.. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతుడి భార్య కౌసల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Next Story