నేటి నుంచే మూడు నెలల రేషన్ బియ్యం

by velandi.Saikiran |

రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

నేటి నుంచే మూడు నెలల రేషన్ బియ్యం
X

మూడు నెలల బియ్యం నేటి నుంచే పంపిణీ

నెలలో ఎప్పుడైనా తీసుకునే అవకాశం

సంగారెడ్డి జిల్లాలో 855రేషన్ దుకాణాలు, 4,42,746 కార్డులు

దిశ, సంగారెడ్డి అర్బన్: రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం నుంచి పంపిణీ మొదలుకానున్నది. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తారు. ఇందుకోసం కావాల్సిన బియ్యం లో కొంత మేర ఇప్పటికే రేషన్ షాప్ లకు ఇప్పటికే చేరవేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నిల్వలు తగ్గే కొద్ది దశల వారీగా సరఫరా చేస్తామని చెబుతున్నారు.

జిల్లాలో 4.42లక్షల కార్డులు..

జిల్లాలోని 26మండలాల పరిధిలో 855రేషన్ షాప్ లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,42,746 కార్డులకు గాను 14,93, 876 మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. వీరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా 89,63,256 నెలకు కేజీలు, మూడు నెలలకు కలిపి 2,68,89,768 కేజీల బియ్యం అవసరమవుతాయని అధికారులు తెలిపారు. బియ్యం పంపిణీ సజావుగా సాగేలా ఇప్పటికే పౌరసరఫరాల శాఖాధికారి బాల సరోజ సమీక్షిస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి షాప్‌లకు రవాణా, లబ్ధిదారులకు పంపిణీపై సూచనలు చేశారు.

30రోజుల పాటు పంపిణీ..

గత వర్షాకాలంలో కూడా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. అప్పట్లో 1 నుంచి 15వ తేదీ వరకే గడువు విధించగా, సర్వర్ సమస్యతో లబ్ధిదారులు గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి రావడంతో గడువు పొడిగిస్తూ వెళ్లారు. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కావొద్దని ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులందరికీ బియ్యం అందేలా నెల మొత్తం షాపులు తెరిచి ఉంచాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే షాపుల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా బియ్యం సరఫరా చేశారు. డీలర్లు నిబంధనలు పాటించేలా నిరంతరం పర్యవేక్షించనున్నారు.

Next Story