- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను నర్సాపూర్ పోలీసులు చాకచక్యంగా బుధవారం అరెస్ట్ చేశారు.

దిశ, నర్సాపూర్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను నర్సాపూర్ పోలీసులు చాకచక్యంగా బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ రంగాకృష్ణ ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డితో కలిసి వెల్లడించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం 870.6 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించే జిప్‌లాక్ కవర్లు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, పంచులు, క్లూస్ టీమ్ మరియు వీడియోగ్రాఫర్ సమక్షంలో నర్సాపూర్ పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. నిందితుల వివరాలు ఆసిఫ్ నగర్, హైదరాబాద్‌కు చెందిన కూనపులి వికాస్(ప్రస్తుతం నర్సాపూర్) హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ జుమాన్ (గంజాయి సరఫరాదారుగా ప్రాథమిక విచారణలో తేలినది) అలాగే హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ శహబాజ్ (గంజాయి రవాణాలో సహకరించినట్లు విచారణలో తేలినది) తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు కూనపులి వికాస్‌పై గతంలో కూడా NDPS Act కింద కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితులపై NDPS యాక్ట్ ప్రకారం.. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. గంజాయి సరఫరా గొలుసులో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతుందన్నారు.






