- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంట్లో కారం పొడి చల్లి.. మెడలో తాళిబొట్టు లాక్కొని పరారైన దొంగ
by Taduka Kalyani |
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని చర్ల రాయిపల్లి గ్రామంలో ఓ మహిళ మెడలోని మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని దొంగ పరారైన ఘటన కలకలం రేపింది.

X
దిశ, రాయికోడ్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని చర్ల రాయిపల్లి గ్రామంలో ఓ మహిళ మెడలోని మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని దొంగ పరారైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపాడు. అనంతరం ఆమె కంట్లో కారం పొడి చల్లి, మెడలో ఉన్న మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. దొంగ లైట్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ వెల్లడించారు. దొంగ ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. అలాగే మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






