- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాపై మర్డర్ ప్లాన్.. వ్యూహాత్మకంగా తప్పించుకున్నా

దిశ సంగారెడ్డి, బ్యూరో : తనను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని,వారి కుట్రలు తిప్పి కొడుతూ వ్యూహత్మకంగా తపోయించుకున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఇతి వృతంగా రూపొందుతున్న "ఎవార్ ఆఫ్ లవ్" జగ్గారెడ్డి సినిమాలో అన్ని ఉంటాయని ఆయన తెలిపారు. ఆ రోజుల్లో ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తనకు లేదని, ఆర్థిక ఇబ్బందులున్నా జన బలం మాత్రం తనకే ఉండేదని గుర్తు చేశారు. నిర్భందాలను దీటుగా ఎదుర్కొన్నానని, తాను జీవితంలో ఎలా ఇదిగానో ఈ సినిమాలో చూస్తారని జగ్గారెడ్డి తెలిపారు.
జగ్గారెడ్డి సినిమా డైరెక్టర్ రామానుజం స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో నిమగ్నం అయ్యారన్నారు. ఈ సినిమాలో ప్రేమ కథకు, తన జీవితంలో జరిగిన మూడు సన్నివేశాలను జోడిస్తున్నాం అని తెలిపారు. సినిమాలో తన ప్రేమ కథ ఉండదని, అందులోని ప్రేమికులకు అండగా నిలిచే పాత్రలో ఉంటానన్నారు. ఈ సినిమా కోసం తనను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడని, జగ్గారెడ్డిగా తన జీవితంలో జరిగిన మూడు సంఘటనలు ఉంటాయన్నారు. స్టూడెంట్ లీడర్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ ఛైర్మన్ గా ఆ రోజుల్లో జరిగిన ముఖ్య ఘట్టాలు ఉంటాయని వెల్లడించారు.
ఆ రోజులలో స్టూడెంట్ లీడర్ గా కౌన్సిలర్ గా , ఛైర్మన్ గా ఉన్న సమయంలో తనకు ఎలాంటి ఆర్థిక బలం, ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదన్నారు. కార్యకర్తల, ప్రజల బలం ఉండేదని గుర్తు చేశారు. ఈ మూడు సందర్బాల్లో పోలీసులు తనపై చేసిన ఒత్తిడులు, నిర్బంధాలను సినిమాలో చూపిస్తామని తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్ తో గొడవ జరిగితే, కలెక్టరుకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకో లు చేశామన్నారు. కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు పోరాటం చేసిన సంఘటనలు సినిమాలో ఉంటాయన్నారు. కౌన్సిలర్, స్టూడెంట్ లీడర్, ఛైర్మనుగా ఉన్న సంఘటనలు, అప్పటి తన పాత్రలో వేరే నటుడు ఉంటారని, మూడు పాత్రల తర్వాత తాను సినిమాలో ఎంటర్ అవుతానని తెలిపారు.