- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక దాడికి పాల్పడింది పాత నేరస్తుడే
సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకొని అతడు పాత నేరస్తుడిగా గుర్తించారు

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకొని అతడు పాత నేరస్తుడిగా గుర్తించారు. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఘాతుకానికి ఒడికట్టింది పాత నేరస్తుడే…
సదాశివపేట పట్టణానికి చెందిన మహమ్మద్ ఖలీమ్ అలియాస్ నావేద్ (24) గతంలో పలు దొంగతనాలు, ఒక రేప్ కేసులో నిందితుడు. సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధి తోపాటు బోరబండ, బీడీఎల్ భానూర్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఇతడి పై నాలుగు కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో జైలుకు వెళ్లి కూడా వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న అతడి అక్క, బావ వద్ద చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్నాడు. కాగా ఈ నెల 20న రాత్రి సమయంలో ఓ 8 ఏళ్ల మైనర్ బాలికలకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు.






