కౌడిప‌ల్లి మండ‌లం స‌ర్పంచ్ ల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కౌడిప‌ల్లి : మండలంలోని 35 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను ఆదివారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మహిపాల్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పరిధిలో ఖరారు చేశారు.

కౌడిప‌ల్లి మండ‌లం స‌ర్పంచ్ ల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు
X

దిశ‌, కౌడిప‌ల్లి : మండలంలోని 35 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను ఆదివారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మహిపాల్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పరిధిలో ఖరారు చేశారు. బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సు మేరకు 50 శాతం కు మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేశారు. కౌడిపల్లి మేజర్ గ్రామపంచాయతీ బీసీ జనరల్ కు కేటాయించారు. మండలంలోని మిగతా గ్రామ పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి. దేవుల తాండ ఎస్టీ ( జనరల్ ), ధర్మసాగర్ గేట్ తాండ ఎస్టీ( మహిళ), హరిచంద్ తండా ఎస్టీ ( మహిళ), జాజితాండ ఎస్టీ( మహిళ), కొచ్చేరు తాండ ఎస్టీ ( జనరల్), కుషన్ గడ్డ తండ ఎస్టీ ( జనరల్), మనంతాయపల్లి తండా ఎస్టీ ( మహిళ), మర్రిచెట్టు తాండ ఎస్టీ( జనరల్), పీర్ల తండా ఎస్టీ ( జనరల్), పీర్య తాండ( మహిళ ), శేరితండా ఎస్టీ ( జనరల్), లింగంపల్లి ఎస్టీ ( మహిళ ), కొటాల ఎస్సీ( మహిళ), కన్నారం ఎస్సీ( జనరల్), వెంకటాపూర్ బి ఎస్సీ( జనరల్), కుకుట్లపల్లి ఎస్సీ( జనరల్), పాంపల్లి బీసీ( మహిళ ), బుజిరంపేట బీసీ ( జనరల్ ), కంచన్ పల్లి బీ సీ ( జనరల్), వెంకటాపూర్ ఆర్ బీసీ( మహిళ ), తునికి బీసీ( మహిళ), మహమ్మద్ నగర్ బీసీ( జనరల్), బూరుగడ్డ అన్ రిజర్వుడు( జనరల్),దేవులపల్లి అన్ రిజర్వుడు ( జనరల్), ధర్మసాగర్ అన్ రిజర్వుడ్( జనరల్), ముట్రాజ్ పల్లి అన్ రిజర్వ్ డు ( మహిళ ), నాగసాన్ పల్లి అన్ రిజర్వుడు ( మహిళ), రాజిపేట అన్ రిజర్వుడు ( మహిళ ), రాయిలాపూర్ అన్ రిజర్వుడ్ ( మహిళ ), సదాశివ పల్లి అన్ రిజర్వుడ్ ( జనరల్), సలాబత్పూర్ అన్ రిజర్వుడు( జనరల్), తిమ్మాపూర్ అన్ రిజర్వుడ్ ( మహిళ ), వెంకట్రావు పేట అన్ రిజర్వుడ్ ( జనరల్), వెల్మకన్న అన్ రిజర్వుడ్ ( మహిళ ) స్థానాలను లాటరీ పద్ధతిలో కేటాయించినట్లు ఎంపీడీవో కార్యాలయ వర్గం వెల్ల‌డించింది.

Next Story