సైలెన్సర్లు పీకి చేతిలో పెట్టిన పోలీసులు..!

by Kodari Anjali |

బైక్‌కు ఉండాల్సిన ఒరిజినల్ సైలెన్సర్లను తీసేసి శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్న ఆకతాయిలపై జిల్లా పోలీసులు చెక్ పెట్టారు.

సైలెన్సర్లు పీకి చేతిలో పెట్టిన పోలీసులు..!
X

దిశ, సంగారెడ్డి: బైక్‌కు ఉండాల్సిన ఒరిజినల్ సైలెన్సర్లను తీసేసి శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్న ఆకతాయిలపై జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. బైక్ సైలెన్సర్లు మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తూ శబ్ద కాలుష్యం కలుగజేస్తున్న 07 వాహనదారులను గుర్తించి, మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే అట్టి వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించారు. వాహనదారులు ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తూ పట్టణ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం సృష్టిస్తే సహించబోమని, అట్టి వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Next Story