హత్య కేసును ఛేదించినపోలీసులు

by Ratna Kumari |

ఇటీవ‌ల జ‌రిగిన ఓ హ‌త్య కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. నిందితుడు అరెస్ట్ అయ్యాడు.

హత్య కేసును ఛేదించినపోలీసులు
X

దిశ, వర్గల్ : ఇటీవ‌ల జ‌రిగిన ఓ హ‌త్య కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. నిందితుడు అరెస్ట్ అయ్యాడు. నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ జరిగిన మంతూర్ కల్పన హత్య కేసును గజ్వేల్ రూరల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. గజ్వేల్ ఏసీపీ కె. నరసింహులు వెల్లడించారు. మెదక్ జిల్లా మసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన భధనపురం పెంటయ్య(30) అనే డ్రైవర్, జల్సాల కోసం గతంలోనూ పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. నెల రోజుల క్రితం చేగుంట కల్లు డిపో వద్ద ఇస్లాంపూర్‌కు చెందిన కల్పనతో పెంటయ్యకు పరిచయం ఏర్పడింది. డిసెంబర్ 31 రాత్రి దావత్ చేసుకుందామని కల్పన కోరడంతో, పెంటయ్య తన అశోక్ లేలాండ్ వాహనంలో ఆమెను తీసుకెళ్లి నాచారం శివారులో మద్యం, బిర్యానీ సేవించారు. ఈ క్రమంలో కల్పన రూ.10 వేలు ఇవ్వాలని, లేదంటే అత్యాచారం కేసు పెడతానని బెదిరించడంతో.. భయపడిన నిందితుడు వాహనంలోని తాడుతో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సీడ్స్ కంపెనీ సమీపంలో పడవేసి, సాక్ష్యాలు దొరకకుండా ఆమె ఫోన్‌ను పగులగొట్టాడు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి వాహనం, ఫోన్, తాడును స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన గజ్వేల్ రూరల్ సీఐ పి. మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి, సిబ్బంది విష్ణు చందర్, పర్శరాములు, సయ్యద్ ఖాజాలను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story