కామ్రేడ్ కేవల్ కిషన్ చూపిన మార్గం సమాజానికి ఆదర్శం : ఎమ్మెల్సీ క‌విత

by Ratna Kumari |

దిశ‌, చేగుంట : కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్గొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం బాట కా

కామ్రేడ్ కేవల్ కిషన్ చూపిన మార్గం సమాజానికి ఆదర్శం :  ఎమ్మెల్సీ క‌విత
X

దిశ‌, చేగుంట : కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్గొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం చేగుంట మండలం పోలంపల్లి లోని కామ్రేడ్ కెవల్ కిషన్ సమాధిని ఆమె సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దొరలు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా కేవల్ కిషన్ ప్రజల తరఫున నిబద్ధతతో పోరాటం చేశారని భూ పోరాటంలో భాగంగా భూముల్లేని పేదలకు భూములు పంచి పేదల పాలిట దైవంగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. కామ్రేడ్ కిషన్ కలలుగన్న సమాజాన్ని నిర్మించడానికి ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కవిత పిలుపునిచ్చారు.అనంతరం స్థానికులు ఏర్పాటు చేసిన చలి మంటలు కాచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనం బాట ఇంచార్జ్ కొట్టాల యాదగిరి, బిసి యునైటెడ్ పూలే ఫ్రెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరి, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు మారన్న, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి కందుల మధు, తెలంగాణ జాగృతి యువజన విభాగం కార్యదర్శి ధ్యాని, తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు రాజేశ్వరి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి పాల్గొన్నారు.

Next Story