వృద్ధుడు అదృశ్యం..

by velandi.Saikiran |

ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూర్

వృద్ధుడు అదృశ్యం..
X

దిశ, పటాన్ చెరు: ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బాదర్ గామ గ్రామానికి చెందిన బి.మాణికయ్య (73) కుటుంబ సభ్యులతో కలిసి ముత్తంగిలో నివసిస్తున్నాడు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాణయ్య తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలిసిన వారిని, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో ఇవాళ పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకి తెలిసిన వారు ఎవరైనా 9849196080 నంబర్ కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.

Next Story