కారుతో ఢీ కొట్టి చంపిన వ్య‌క్తి అరెస్ట్

by Ratna Kumari |

దిశ‌, కొండ‌పాక : తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన కేసు, ఆర్థిక లావాదేవీలు పాత కక్షలతో జరిగిన హత్య అని సిద్ధిపేట పోలీసులు నిర్ధారించారు. జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి కి చెందిన మహమ్మద్ షాబి

కారుతో ఢీ కొట్టి చంపిన వ్య‌క్తి అరెస్ట్
X

దిశ‌, కొండ‌పాక : తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన కేసు, ఆర్థిక లావాదేవీలు పాత కక్షలతో జరిగిన హత్య అని సిద్ధిపేట పోలీసులు నిర్ధారించారు. జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి కి చెందిన మహమ్మద్ షాబిర్ హత్య కేసులో, మృతుడి వరసకు మామ అయిన జూనియర్ లైన్‌మెన్ మహమ్మద్ ఖాజా ఖాద్రిఖదీర్ ను సోమవారం అరెస్ట్ చేశారు. తాజాగా తొగుట సీఐ ఎస్కే లతీఫ్, కుకునూర్ పల్లి ఎస్ఐ శ్రీనివాస్ విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు. షాబిర్, ఖాదీర్ ఇద్దరూ కలిసి హార్వెస్టర్ కొనుగోలు చేసి వ్యాపారం చేశారు. ఇటీవల వారి మధ్య డబ్బుల విషయంలో తీవ్ర గొడవలు జరిగాయి. షాబిర్ కోసం ఖాదీర్ తన ఊరిలో ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ తీసుకునేందుకు సహకరించాడు. కానీ షాబిర్ నెలవారీ వాయిదాలు కట్టకపోవడంతో ఖాదీర్‌ను బ్యాంకు అధికారులు ఇబ్బంది పెట్టారు. దీనిపై షాబిర్‌ను అడిగితే డబ్బులు ఇవ్వకపోగా, బెదిరించడంతో ఖాదీర్ ఎలాగైనా షాబిర్‌ను చంపాలని పథకం వేశాడు. నవంబర్ 22న షాబిర్ బుల్లెట్ బైక్ పై వెళ్తుండగా.. ఖాదీర్ తన కారుతో అతి వేగంగా ఢీకొట్టి, పలుమార్లు గుద్ది హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఖాదీర్‌ను కాపాడటానికి ప్రయత్నించి, నేరం తాను చేశానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించిన అతడి సోదరుడు మహమ్మద్ షబ్బీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Next Story