ప్రాణం తీసిన ఈత స‌ర‌దా..!

by Ratna Kumari |   (  Updated:2026-04-28 10:42:26  IST  )

వేసవి తాపానికి చల్లని నీటిలో స్నేహితులతో కలిసి ఈత కొడదామన్న ఆ యువకుడి సరదా అతడి ప్రాణాలనే తీసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్ర శివారులోని మంజీరా డ్యాంలో చోటు చేసుకుంది.

ప్రాణం తీసిన ఈత స‌ర‌దా..!
X

దిశ, సంగారెడ్డి : వేసవి తాపానికి చల్లని నీటిలో స్నేహితులతో కలిసి ఈత కొడదామన్న ఆ యువకుడి సరదా అతడి ప్రాణాలనే తీసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్ర శివారులోని మంజీరా డ్యాంలో చోటు చేసుకుంది. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన గొల్లంకి గణేష్ (25) ఈనెల 26 న సాయంత్రం కల్పగూరు గ్రామ పరిధిలోని మంజీరా డ్యామ్ కి తన స్నేహితులతో కలిసి వచ్చాడు. సాయంత్రం డ్యాం లోని నీటిలో దిగి ఈత కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈత సరిగా రాకపోవడంతో ఆ నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ఈ నెల 27న అతడి మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే మృతి చెందిన యువకుడు ఇస్నాపూర్ పరిధిలోని సెన్సాకోర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఓ వైపు పోలీసులు నీటి ప్రవాహాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా కూడా కొందరు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story