అంతా నిశ్శబ్దం.. ముగిసిన మొదటి విడత ప్రచారం!

by Ajay Maddhiboyina |

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమరం ముగిసింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది.

అంతా నిశ్శబ్దం.. ముగిసిన మొదటి విడత ప్రచారం!
X

దిశ, మెదక్ ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమరం ముగిసింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 11న జరిగే పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేస్తుండగా అభ్యర్థులు మాత్రం ఓటర్లు ప్రలోభాలు పర్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేసేందుకు సిద్ధం అయ్యారు. మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. జిల్లా ఉన్న 492 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో విడతలో 6 మండలాల్లో ఎన్నికలు ఈ నెల 11న నిర్వహిస్తున్నారు.

ఎన్నికలు జరిగే 144 సర్పంచ్ స్థానాలతో పాటు 1072 వార్డు స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులు గత వారం రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీ అర్ ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు సైతం బరిలో ఉన్న మద్దతుదారుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. చాలా వరకు గ్రామాల్లో పోటీ నువ్వా నేనా అన్నటుగా సాగడం తో గెలుపు కోసం అభ్యర్థులు గట్టిగానే ప్రయత్నం చేశారు. హోరా హోరీగా సాగిన ప్రచారం పర్వం మంగళ వారం సాయంత్రం తో ముగిసింది.

దీనితో ఇతరులను నేరుగా వెళ్ళి ఇటు అడిగి ఆకట్టుకునేందుకు అభ్యర్థులు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు మధ్యలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండడం తో ఈ ఒక్క రోజులో గెలుపు కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం జిల్లాలో జరుగుతున్న మొదటి విడత ఎన్నికలకు అధికార యంత్రాంగ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

Next Story