- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నతండ్రే కాటేశాడు.. తొమ్మిదేళ్ల కూతురుపై అత్యాచారం
కన్నతండ్రే కసాయిగా మారి, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడటం మానవత్వానికే మచ్చ.

దిశ, గజ్వేల్ : కన్నతండ్రే కసాయిగా మారి, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడటం మానవత్వానికే మచ్చ. కామంతో కళ్ళు మూసుకుపోయి ఆ తండ్రి రక్త సంబంధాన్ని సైతం మరచి కన్నకూతురుపైనే లైంగికదాడికి ఒడిగట్టాడు. లైంగిక దాడికి గురైన కుమార్తె జరిగిన దారుణాన్ని తన బాధను తల్లికి చెప్పుకోవటంతో డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గజ్వేల్ పట్టణంలోని పటేల్ బజార్ లో ఓ ముస్లిం కుటుంబం నివాసముంటుంది. తండ్రి హార్వెస్టర్ డ్రైవర్ కాగా.. తల్లి ఓ విత్తన కంపెనీలో కూలీగా పని చేస్తున్నది. వీరికి నలుగురు కూతుళ్లు. ఈనెల 21 న తల్లి కూలి పనికి వెళ్లగా.. రెండవ, మూడవ కూతుళ్లను తండ్రి బంధువుల ఇంటి వద్ద విడిచి వచ్చాడు. మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి 4వ తరగతి చదువుతున్న చిన్న కూతురు (9)కు రూపాయి ఇచ్చి చాక్లెట్ కొనుక్కోమని పంపించాడు.
తిరిగి వచ్చిన కూతురును మేడపైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికి చెప్పొద్దని బెదిరింపులకు గురిచేశాడు. మంగళవారం చిన్న కూతురు మలద్వారం వద్ద చాలా నొప్పిగా ఉందని తల్లికి తన బాధను వ్యక్తం చేసింది. చర్మం కమిలిపోయి ఉండడంతో ఏం జరిగిందని చిన్న కూతురిని ప్రశ్నించగా.. జరిగిన దారుణాన్ని చిన్న కూతురు తల్లికి వెల్లడించింది. మత్తులో తండ్రి అగాయిత్యం చేయగా.. తల్లికి తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయం తన అక్కకు చెప్పడంతో వెంటనే డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదును స్వీకరించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం బుధవారం ఉదయం ఇరుగుపొరుగు వారికి తెలియడంతో తండ్రిని చితకబాదినట్లు తెలిసింది. పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో సైతం మిగతా కూతుర్లపై కూడా లైంగిక దాడికి ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో రక్త సంబంధానికి ఉన్న అవినాభావ సంబంధ విలువలను మంట కలుపుతున్నాయంటూ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






