- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల చిరకాల వాంఛ సొంతింటి కల
సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.

దిశ, సదాశివపేట: సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు డప్పు చప్పుళ్ళతో నిర్మలా జగ్గారెడ్డి కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల చిరకాల వాంఛ అయిన సొంతింటి కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ బిల్లుల మంజూరు లో ఎక్కడా జాప్యం లేకుండా నిర్మాణానికి అనుకూలంగా నిధులు విడుదల అవుతున్నాయన్నారు. ఇప్పటికే వందల సంఖ్య లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయని, ఇందిరమ్మ ఇంటికి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు వెంటనే చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టిపల్లి గ్రామ సర్పంచ్ గొల్ల రాములమ్మ లక్ష్మమ్మయ్య, కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ సిద్దన్న, మండల ప్రెసిడెంట్ ఒగ్గు శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.






