- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇనుప కంచెలో ఇరుక్కున్న బాలుడి తల.. రెండు గంటల పాటు నరకయాతన
by Kema Shiva Kumar |
ఇనుప కంచెలో ఓ బాలుడి తల ఇరుక్కొని రెండు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడిన ఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలో చోటుచేసుకుంది.

X
దిశ, అల్లాదుర్గం : ఇనుప కంచెలో ఓ బాలుడి తల ఇరుక్కొని రెండు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడిన ఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఐబీ చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద సైడ్ ఇనుప కంచెలో ప్రయాణికుల్లోని ఓ బాలుడి తల ఇరుక్కుపోయి నరకయాతన పడ్డాడు. ఎవరు లాగినా.. ఆ బాలుడి తల బయటకు రాకపోవడంతో విలవిలలాడాడు. రెండు గంటల పాటు ఆ బాలుడిని చూసి ప్రయాణికులు అయ్యో పాపమని కన్నీరు పెట్టుకున్నారు. ఎట్టకేలకు అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఇనుప రాడ్లను కట్ చేసి బాలుడిని రక్షించారు.
Next Story






