- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ కేంద్రాల్లోనే వడ్లు అమ్మండి: టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
ఇవాళ టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఏడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: రైతన్నలు ప్రైవేట్ మిల్లర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి మద్దతు ధరతో పాటు బోనస్ పొందండి” అని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. సదాశివపేట పట్టణంలోని మార్కెట్ కమిటీతో పాటు సదాశివపేట మండలం నందికంది, కొండాపూర్ మండలం మారేపల్లి, కొండాపూర్, తేర్పొల్, గొల్లపల్లి, మాల్కాపూర్‌లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం 7 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
సన్న వడ్లకు రూ 500 బోనస్
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, పీఏసీఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వడ్లు అమ్మితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ500 బోనస్ ఇస్తుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మకుండా నేరుగా కేంద్రాలకు వచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేణినర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ కంది కృష్ణ, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిద్దన్న, వ్యవసాయ శాఖ అధికారులు, సదాశివపేట, కొండాపూర్ మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.






