- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత..
రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరు కావడంతో బీజేపీ నాయకులు మోడీ జిందాబాద్, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఫోటోలు లేకుండా ఏర్పాటు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు వేదిక వద్ద, రైల్వేస్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీలను చించి వేశారు. ఓకానోక సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మద్య తోపులాట చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒక్కరిపై ఒక్కరు కుర్చీలు విసురు కోవడంతో పలువురికి గాయాలైయ్యాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డిపై బ్లెడ్ తో దాడి చేయడంపై ఆపార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పారు.






