- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలంగట్టుపైనుండి పడి కౌలు రైతు మృతి
by Kodari Anjali |
పొలం గట్టు పైనుండి పడి ఓ కౌలురైతు మృతి చెందిన సంఘటన వెల్దుర్తి మండలంలోని శేరిలా గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.

X
దిశ, వెల్దుర్తి: పొలం గట్టు పైనుండి పడి ఓ కౌలురైతు మృతి చెందిన సంఘటన వెల్దుర్తి మండలంలోని శేరిలా గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన శంకూర్ శేకులు (35) గత కొన్ని లుగా గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో ఖరీఫ్ సీజన్ కావడంతో వరినారు వేసేందుకు ట్రాక్టర్‌తో భూమిని చదునుచేస్తున్నాడు. సోమవారం ట్రాక్టర్లోకి డీజిల్ తెచ్చేందుకు వెళ్లి తీసుకెళ్తున్న సమయంలో గట్టు పైనుండి పొలంలోని బురదలో పడడంతో ఊపిరాడకపోవడంతో రైతు శేకులు అక్కడికక్కడే మృతి చెందాడు. ముతుడికి భార్య విజయ ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు.
Next Story






