పది ఎకరాల మొక్కజొన్న పంట దగ్దం..

by Kodari Anjali |

పది ఎకరాల మక్క జొన్న పంట అగ్నికి ఆహుతి అయిన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పది ఎకరాల మొక్కజొన్న పంట దగ్దం..
X

దిశ, బెజ్జంకి: పది ఎకరాల మొక్క జొన్న పంట అగ్నికి ఆహుతి అయిన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామ శివారులోని చేలుకల కొండల్ రెడ్డి, చేలుకల ప్రతాప్ రెడ్డి, చిలుకల కేశవరెడ్డి వారి వారి వ్యవసాయ క్షేత్రాల్లో మొక్క జొన్న పంట సాగు చేశారు. శుక్రవారం ఎమైందో తెలియదు కాని మొక్క జొన్న పంటకు నింపు అంటుకుంది. ముగ్గురు రైతులకు చెందిన 10 ఎకరాల్లో మొక్క జొన్న పంట పూర్తి గా దగ్దమైంది. విషయం తెలుసుకొని రైతులు సంఘటన స్థలానికి వెళ్లే లోపే పంట అగ్ని కి ఆహుతి అయింది. చేతికి అందిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు విలపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో మొక్క జొన్న పంట వేగంగా దగ్దమైనట్లు స్థానికులు తెలిపారు. మొక్క జొన్న పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బిగ్గుల్ల మోహన్ కోరాడు.

Next Story