- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 22న తెలంగాణ పనుల జాతర
తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ నెల 22 నుండి పనుల జాతర- 2025 కార్యక్రమం

దిశ, సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ నెల 22 నుండి పనుల జాతర- 2025 కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జ్యోతి తెలిపారు. పనుల జాతరలో భాగంగా జిల్లాలో 2451 పనులకు రూ.1959.52 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. పశువుల కొట్టాల నిర్మాణం కోసం 668 యూనిట్లకు ఒక్కో యూనిట్ కు రూ. 94 వేలు, 36 గొర్రెల షెడ్డు నిర్మాణానికి ఒక్కో షెడ్డుకు రూ.1.20 లక్షలు, కోళ్ల షెడ్డులు 24 ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.0.50 లక్షలు, వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లు 60కి ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.0.24 లక్షలు, అజోల్ల షెడ్లు 30 వీటి ఏర్పాటుకు ఒక్కో యూనిట్ కు రూ. 0.20 లక్షలు , జిల్లాలో నాలుగు చోట్ల చెక్ డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు.
ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి రూ. 5 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో 1500 ఇంకుడు గుంతల నిర్మాణానికి ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.8 వేల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. 27 గ్రామపంచాయతీ నిర్మాణంకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో గ్రామపంచాయతీ నిర్మాణానికి రూ.20 లక్షలు, 62 అంగన్వాడీల కేంద్రాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఒక అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి రూ.8 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు తెలిపారు. 40 పాఠశాలలో స్కూల్ టాయిలెట్స్ నిర్మాణం కోసం రూ. రెండు లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులను ఈనెల 22వ తేదీన ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల చేతిలో మీదుగా ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.






