‘రాష్ట్రాన్ని రక్షించేందుకే తెలంగాణ రక్షణ సేన’: కల్వకుంట్ల కవిత

by Kodari Anjali |

ఇవాళ కల్వకుంట్ల కవిత మోతే గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరాలయాన్ని సందర్శించి, టీఆర్ఎస్ పార్టీ జెండాను, కండువాలకు ప్రత్యేక పూజలు చేయించారు.

‘రాష్ట్రాన్ని రక్షించేందుకే తెలంగాణ రక్షణ సేన’: కల్వకుంట్ల కవిత
X

దిశ, అక్బర్‌పేట భూంపల్లి: రాష్ట్రాన్ని రక్షించేందుకే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) స్థాపించడం జరిగిందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సామాజిక న్యాయం, ప్రజాసేవలో టీఆర్ఎస్ నిమగ్నమౌతుందని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరాలయాన్ని సందర్శించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాకు, కండువాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులున్నారు.

Next Story