కాళేశ్వరం కాలువకు భూసేకరణ వేగంగా చేపట్టండి: కలెక్టర్ రాజర్షి షా

by Taduka Kalyani |

జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 13, రామాయంపేట కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం కాలువకు భూసేకరణ వేగంగా చేపట్టండి: కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, మెదక్ ప్రతినిధి: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 13, రామాయంపేట కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, భూ సేకరణ, 13వ ప్యాకేజి, రామాయంపేట, శంకరంపేట కెనాల్ పనులకు సంబంధించి అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి నీటిపారుదల, రెవిన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏజెన్సీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ, కాలువ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

ప్రధానంగా రామాయంపేట కాలువకు సంబంధించి భూ సేకరణ పనులు, చిన్న శంకరంపేట్ కు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి పెగ్ మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల ఎస్ఈ యేసయ్య, ఈఈ శ్రీనివాస్ రావు, డీఈఈ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ ఎస్ఈ వేణు, ఈఈ నారాయణ్ రావు, ఆర్ డీఓ లు సాయిరాం, శ్యాం ప్రకాష్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే శశికుమార్, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బలరాం, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story