- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానస్పదంగా మహిళా మృతి
by Ratna Kumari |
మండలంలోని ముని గడపలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినది.

X
దిశ, జగదేవపూర్ : మండలంలోని ముని గడపలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మునిగడప గ్రామానికి చెందిన శివరాత్రి జ్యోతి (37) బుధవారం ఉదయం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్తున్నట్లు తన తల్లి నర్సవ్వకు ఫోన్ చేసి తెలిపింది. అనంతరం గురువారం ఉదయం జ్యోతి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు నర్సవ్వకు సమాచారం అందించారు. కూతురు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన నర్సవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






