అనుమానంతో భార్య‌పై ఇనుప రాడ్డుతో దాడి

by Ratna Kumari |

కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భార్యపై భర్త ఇనుప రాడుతో దాడి చేశాడు.ఈ ఘటన జగదేవపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

అనుమానంతో  భార్య‌పై ఇనుప రాడ్డుతో దాడి
X

దిశ, జగదేవ్‌పూర్ : కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భార్యపై భర్త ఇనుప రాడుతో దాడి చేశాడు.ఈ ఘటన జగదేవపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. జగదేవపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సతెళ్లి జయలక్ష్మీ- నర్సయ్య భార్య‌-భ‌ర్త‌లు. భార్య‌పై అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడుతుండేవాడు న‌ర్స‌య్య‌. ఈ క్రమంలో శుక్రవారం బాధితురాలు గ్రామంలోని మేనత్త ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లిన నర్సయ్య, ఇనుప రాడుతో తలపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి కేకలు విని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story