ఎరువుల దుకాణాలపై జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీలు

by Kodari Anjali |

పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎరువుల దుకాణాలపై జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీలు
X

దిశ, ములుగు: మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, యూరియా విక్రయ విధానాన్ని పరిశీలించారు. యూరియా విక్రయాలు తప్పనిసరిగా యూరియా బుకింగ్ యాప్ ద్వారానే నిర్వహించాలని డీలర్లకు ఆదేశించారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు కూడా యాప్ ద్వారా బుకింగ్ పూర్తి చేసేలా సహకరించాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ కాల వ్యవధి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. నకిలీ ఎరువులు, పురుగుమందుల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లైసెన్సు పొందిన దుకాణాల నుంచే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. తనిఖీలలో మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు

Next Story