- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య..
ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, మిరుదొడ్డి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శేర్ల సాయిరాం (17) అనే విద్యార్థి ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. పరీక్ష ఫలితాలు వచ్చినప్పటి నుండి సాయిరాం తీవ్ర ఆవేదనకు గురవుతుండేవాడు. కుటుంబ సభ్యులు అతడిని ఓదార్చి, ధైర్యం చెప్పినప్పటికీ బాధను మర్చిపోలేక, శుక్రవారం సాయంత్రం పొలం దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా సాయిరాం తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి సురేందర్ పొలం వద్దకు వెళ్లి చూడగా, అక్కడ ఒక చెట్టుకు సాయిరాం ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడని తెలిపారు. తల్లి శేర్ల మమత ఫిర్యాదు మేరకు భూంపల్లి ఎస్సై హరీష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






