- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
by Kema Shiva Kumar |
ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ టీం వ్యవసాయ సంచాలకులు పుష్ప హెచ్చరించారు.

X
దిశ, ఝరాసంగం : ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ టీం వ్యవసాయ సంచాలకులు పుష్ప హెచ్చరించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి వెంకటేశం, ఎస్సై అంబాజీతో కలిసి వారు దాడులు నిర్వహించారు. దుకాణాల్లో ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విత్తనాలు, ఎరువులను విక్రయించిన సమయంలో రైతులకు తప్పనిసరిగా రశీదులను ఇవ్వాలని సూచించారు. తప్పనిసరిగా ఫర్టిలైజర్ దుకాణాల దారులు వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోనాలని దుకాణాలకు హెచ్చరించారు. రోజు స్టాక్ ను బోర్డుపై రాయాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Next Story






