- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్ చార్జి ఇలా ఉంటారా..?
సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ప్రతి

దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూ బ్లాక్ స్థాయి, మండల కమిటీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటుంది. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఈ అభిప్రాయ సేకరణకు ఏఐసీసీ పరిశీలకురాలిగా జరిత, పీసీసీ పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. క్షేత్ర స్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు అధ్యక్ష పదవి కోసం ఆసక్తిగా ఉన్న నాయకులను గుర్తించేందుకు ప్రతి నియోజకవర్గం వారిగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పటాన్ చెరు నియోజకవర్గ సమావేశాన్ని సితార గ్రాండ్ హోటల్ లో నిర్వహించారు.జిల్లాలో ఎక్కడ లేని విధంగా మీడియాకు దూరంగా జరిగిన ఈ సమావేశంలో జరిగిన ఆందోళన, రసాభాస ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డీసీసీ అభిప్రాయ సేకరణ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తే మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ఆరోపణలకే సమావేశాన్ని సరిపెట్టారని తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమకు గుర్తింపు దక్కడం లేదంటూ ఏఐసీసీ అబ్జర్వర్ స్జరిత, టీపీసీసీ అబ్జర్వర్ లక్ష్మీ కాంత్ రావుపై విరుచుకుపడినట్లు చెప్తున్నా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసినట్లు సమాచారం. అయితే నాయకుల వాదనలను సావధానంగా విన్న ఏఐసీసీ అబ్జర్వర్ పటాన్ చెరు కాంగ్రెస్ నేతల లొల్లి పై తీవ్రంగా రియాక్ట్ అయినట్లు కొందరు నేతలు వెల్లడించారు. తమకు పని చేయడం చేతకాక ఇతరులపై నిందలు వేయడం, ప్రతి వేదికపై సమస్యను సృష్టించడమే పనిగా పెట్టుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. నాయకులు గలాటా చేస్తుంటే కనీసం సముదాయించే ప్రయత్నం చేయకపోవడం తో పాటు వారికి మద్దతుగా విమర్శలు చేయడం పట్ల ఇదేం తీరని కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ను నిలదీసినట్లు చర్చ జరుగుతుంది..
క్రమ శిక్షణ లేకుంటే వేటు తప్పదు..
కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చేసిన గొడవ ఆందోళన పట్ల ఎఐసిసి అబ్జర్వర్ వీస్తు పోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకునే నాయకులు పార్టీ పట్ల విధేయతతో క్రమశిక్షణతో మెలుగుతూ పార్టీ లైన్లో పని చేయాలని సూచించినట్లు చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని ఒకరిద్దరు నాయకుల ప్రయోజనాలకోసం పని చేయొద్దని ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీ అధిష్టానం నిర్ణయాలను గౌరవించాలని, పార్టీలో కొనసాగడానికి ఇష్టం లేని నాయకు లు నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. మహాసముద్రంలో నుంచి కొంత నీరు బయటకు వెళ్లినంత మాత్రాన సముద్రానికి వచ్చిన నష్టం లేదని తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ముందు లీడర్లుగా ఎదగండి..
కాంగ్రెస్ సమావేశంలో ప్రతి విషయాన్ని రభస చేసి ఇష్యూ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ అబ్జర్వర్ గట్టి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. తమ స్వప్రయోజనాల గురించి కాకుండా పార్టీ కోసం ఆలోచన చేయాలని ఇక్కడి నాయకుల వ్యవహార శైలి సరిగ్గా లేదని ముందు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్తున్నారు. అధికారులు కార్యక్రమాలకు పిలవడం లేదని అలక వహించడం సరికాదని అవసరమైతే సొంత కూర్చుని తీసుకెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ప్రతి నాయకుడికి కార్యకర్తకు ఉందని ఆమె వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో అధికారులు సహకరించడం లేదని పిర్యాదులు చేస్తున్నారంటే మీలో ఉన్న లీడర్ షిప్ లోపాలు తెలుస్తున్నాయని కుండబద్దలు కొట్టినట్టు ఒక నాయకుడు తెలిపారు. ముందు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికినట్లు సమాచారం.
దళిత ఎమ్మెల్యేపై అనుచిత ప్రవర్తన..
కార్యక్రమం మొదలైన నాటి నుంచి ఆరోపణలు, విమర్శలు తప్ప వేరేవి స్థానిక నాయకులు మాట్లాడకపోవడంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తతంగాన్ని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పక్కన నాయకులతో సంభాషిస్తున్నట్లు తెలిసిం ది. అయితే ఆ సమయంలో మాట్లాడుతున్న ఒక నాయకు డు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్ రావు పై అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. నాయకులు మాట్లాడేది వినడానికి వచ్చారా లేదా మీరు ముచ్చట్లు పెట్టుకోవడానికి సమావేశంలో కూర్చున్నారా అంటూ చాలా ఘాటుగా మాట్లాడినట్లు చర్చ జరుగుతుంది. ఆ నాయకుడి మాటల కు అవాక్కైన ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు జరిగిన వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సైతం ఎమ్మెల్యే అనే హోదాకి గౌరవం ఇవ్వకుండా ఒక దళిత ఎమ్మెల్యే పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. దినిపై సైతం ఏఐసీసీ పరిశీలకురాలు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం మేల్కొని గ్రూపు తగాదాలకు కళ్ళెం వేయకపోతే పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశముంది.






