- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తయారీ వద్ద నుంచి విఘ్నేశ్వరుని విగ్రహం చోరీ..!
వినాయక చవితి వచ్చిందంటే చందాలు పోగు చేసి గణనాధులను కొంటాం.

దిశ, మెదక్ ప్రతినిధి : వినాయక చవితి వచ్చిందంటే చందాలు పోగు చేసి గణనాధులను కొంటాం. ఎంత ఖర్చయినా పర్వాలేదని ధూమ్ ధాం చేస్తాం.. కొనుగోలు చేసి చేసేది పండగ.. కొట్టేసి చేస్తే దాన్నే దొంగతనం అంటారు.. ఇదే మెదక్ జిల్లా కేంద్రంలో జరిగింది. వినాయకుల విగ్రహాల తయారీ వద్ద నుంచి దొంగతనంగా వాహనంలో వినాయకుడి విగ్రహం తీసుకు వెళ్ళిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని చంద్ర భవన్ కాంప్లెక్స్ లో జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం తో విగ్రహం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో సురేష్ ప్రతియేట గణనాధుల విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. వినాయక చవితి పండుగ త్వరలోనే ఉండడం తో భారీ సంఖ్యలో విగ్రహాల తయారు చేస్తున్నారు.
పదుల సంఖ్యలో ఉన్న విగ్రహాల పై దొంగల కన్ను పడింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి ట్రాలీ ఆటో లో వచ్చిన నలుగురు వ్యక్తులు భారీ ఎత్తున ఉన్న వినాయకుడి విగ్రహాన్ని గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేసి తీసుకు వెళ్ళారు. ఉదయం లేచి చూసిన విగ్రహాల తయారీదారులు ఒక విగ్రహం కనిపించలేదు. దీంతో కాంప్లెక్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ట్రాలీ ఆటోలో విగ్రహాన్ని దొంగతనంగా వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. చాలా వరకు విగ్రహాలు బయటే పెడతామని, కానీ ఇప్పటి వరకు దొంగతనం జరగలేదని, మొదటి సారి ఎలా జరిగిందని బాధితులు వాపోయారు. ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళి వేరే చోట అమ్మేందుకు తీసుకు వెళ్ళారా.. లేక కొనడం ఎందుకు అని ఇలా ప్లాన్ చేశారా.. అన్నది తెలియాల్సి ఉంది. వినాయకుడి విగ్రహం చోరీ ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






