- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళితుల ఇంట ‘పాల’ వెల్లువ..ఎస్సీ కార్పొరేషన్ భారీ స్కీమ్!
ఎస్సీ సా మాజిక వర్గ యువత సొంతంగా వ్యాపారం చేసుకొని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ సరికొత్త బాటలు వేస్తోంది.

దళితుల ఇంట ‘పాల’ వెల్లువ
ఎస్సీ కార్పొరేషన్ భారీ స్కీమ్!
విజయ డెయిరీతో చేతులు కలిపిన సర్కార్..
రూ. 1.60 లక్షల సబ్సిడీతో గేదెల పంపిణీ...?
వికారాబాద్ జిల్లాకు 81 యూనిట్లు మంజూరు
నేటితో ముగియనున్న గడువు!
దిశ, దౌల్తాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ సా మాజిక వర్గ యువత సొంతంగా వ్యాపారం చేసుకొని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ సరికొత్త బాటలు వే స్తోంది. విజయ డెయిరీ భాగస్వామ్యంతో ‘డెయిరీ యానిమల్ పర్చేజ్ స్కీమ్’కు శ్రీకారం చుట్టింది. ఊరూ రా పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూ పొందించారు.
భారీ సబ్సిడీ.. తక్కువ భారం!
ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రెండు పాడి పశువుల (గేదె లు)యూనిట్‌ను అందజేస్తారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 2.40 లక్షలు కాగా, పేద లబ్ధిదారులపై భారం పడకుండా ప్రభుత్వం భారీ సబ్సిడీని ప్రకటించింది.
భారీ సబ్సిడీ.. తక్కువ భారం!
ఏకంగా రూ. 1,60,000 మొత్తాన్ని ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రూపంలో భరిస్తుంది. మిగిలిన రూ. 80,000 మాత్రమే బ్యాంక్ రుణంగా ఉంటుం ది. అంటే అతి తక్కువ పెట్టుబడితో లక్షల విలువైన పాడి సంపద లబ్ధిదారుల సొంతమవుతుంది.
వికారాబాద్‌కు 81 యూనిట్లు..!
ఈ పథకం కింద వికారాబాద్ జిల్లా కు రాష్ట్ర ప్రభుత్వం 81 యూనిట్లను మంజూరు చేసింది. జిల్లాలోని మం డలాల వారీగా ఉన్న జనాభా ప్రాతిపదికన ఈ లక్ష్యాలను కేటాయించనున్నారు. జిల్లాలోని అన్ని ప్రాం తాల నిరుద్యోగ యువతకు స మా నంగా అవకాశం లభించనుంది.
అర్హతలు ఇవే..
పథకం దుర్వినియోగం కాకుండా అధికారులు కఠిన నిబంధనలు విధించారు.
- కొత్తవారికే ఛాన్స్. గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఏ రకమైన లబ్ధి పొందిన వారైనా ఈ పథకానికి అనర్హులు.
- మౌలిక సదుపాయాలు గేదెల పోషణకు వీలుగా కనీసం 10 గుం టల భూమి, ఖచ్చితమైన నీటి సదుపాయం కలిగి ఉండాలి.
- పత్రాల సమర్పణ దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భూమి పాస్ బుక్ జత చేయాలి.
గడువు దాటితే నో ఛాన్స్!
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఈ నెల 23వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకోవాలి. గడువు ముగిసిన తర్వా త వచ్చే అభ్యర్థనలను స్వీకరించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
లక్ష్యాన్ని చేరుకుంటాం..
వికారాబాద్ జిల్లాకు 81 యూనిట్లు మంజూరయ్యాయి. మండలాల వారీగా జనాభా ప్రకారం టార్గెట్ ఇచ్చి, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. రూ. 1.60 లక్షల భారీ సబ్సిడీ ఉన్న ఈ పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో అందరూ యజమానులుగా ఎదగాలి.
-బాబు మోసెస్, ఈడీ, వికారాబాద్ ఎస్సీ కార్పొరేషన్






