- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ మాఫియా.. నమ్మి కొన్నారో, నట్టేట్లో మునిగినట్లే
వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం ఆ తర్వాత అడ్డగోలుగా లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్మేయడం తంతుగా మారిపోయింది.

దిశ, నారాయణఖేడ్: అనుమతులు తీసుకోరు ప్రభుత్వానికి పైసా చెల్లించరు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం ఆ తర్వాత అడ్డగోలుగా లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్మేయడం తంతుగా మారిపోయింది. చెరువులో బర్లని తోలి కొమ్ములు బేరం చేసినట్లుగా బాధితులకు వెంచర్లు వేసి బ్రోచర్ చూసి ఏదో ఒక సర్వే నెంబర్లతో సామాన్యులను మోసం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 40 పైన వెంచర్ల యజమానులు దొంగల ముఠా ఏర్పాటు చేసి సిండికేట్ అయ్యి అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి రియల్ దందా కొనసాగిస్తున్నారు. అద్దంలో భూతద్దం చూపించినట్లు.. పక్కనే బీదర్, నిమ్జ్, నిజాంపేట నుంచి బీదర్ వరకు నేషనల్ హైవే రోడ్లను చూయించి అమాయకులకు మోసం చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.
సీఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ లో నాగల్ గిద్ద మండలంలోని వల్లూరులో 45 సర్వే నెంబర్ లో 30 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన బోరే పత్తి, అంజిరెడ్డి, కొత్తూరుకు చెందిన రాజు మధ్యవర్తులతో ఢిల్లీకి సంబంధించిన రియల్ వ్యాపారి వద్ద 9 వేలకు 2004లో కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన నుంచి అమాయకులను అంటగట్టి మోసం చేస్తున్నారు.. కర్చు గుత్తి గ్రామ శివారులో సర్వే నంబర్ 195/ఆ/2/1లో6 ఎకరాలు, ఇరక్ పల్లి గ్రామ శివారులో196అ2/1/1 లో 12 ఎకరాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు ఏర్పాటుచేసి అమాయకులకు అంటగట్టి మోసం చేశారు.
వీజేఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ లో నాగల్ గిద్ద మండలం కూబాతండా శివారులో సర్వే నెంబర్ 77,78,79లో 14ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి నుంచి కోర్టులో ఇప్పటికీ కోర్టులో కేసు ఉండ డంతో బాధితులు మోసపోయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంగ్టి మండలంలోని సిద్ధ హర్గా గ్రామ శివారులో 30ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రస్తుతం 15 ఎకరాలలో అనుమతి లేని వెంచర్ ఏర్పాటు చేయడంతో పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్ కు నోటీసులు అందజేశారు. ఈ కంగ్టి మండలంలో భూములు కొనవద్దు, అమ్మ వద్దని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్పీ ఆదేశాలతో పెద్ద పెద్ద బోర్డు లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం డబల్ రిజిస్ట్రేషన్ ఉండడంతో కొనుగోలు చేసిన వారు చాలామంది మోసపోతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయిందని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
లోటస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్: లో సిర్గాపూర్ మండలం గౌడ్ గాం శివారులో సర్వే నంబర్ 55/1,52/13,52/12 లో 16 ఎకరాల భూమి అర్జునుని రైతు వద్ద 11,12 లక్షల వరకు రైతుల వద్ద కొనుగోలు చేశారు. అబ్బెంద శివారులోని 120 సర్వే నంబర్లు 30 ఎకరాలకు భూమిని కొనుగోలు చేసి 14 ఎకరాల్లో అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేయడంతో పంచాయతీ సెక్రెటరీ లోటస్ యజమాని రమేష్ కు నోటీసు అందజేశారు.
హరితవనం ఇన్ఫ్రా డెవలప్మెంట్: నాగల్ గిద్ద మండలం మొర్గి శివారులోని సర్వే నంబర్ 23/13,23/1,లో 40 ఎకరాల్లో భూమిని కొనుగోలు చేశారు. వెంచర్ కి దారి లేకపోవడంతో దళితుల అసైన్డ్ 2 ఎకరా భూమిని కబ్జా చేసి రోడ్లు వేశారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి నిర్ధారించారు. వెంచర్ లో అమాయకులకు అంటగట్టడంతో రెవెన్యూ, పోలీసు, కలెక్టర్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత్ నిర్మాన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్: నారాయణఖేడ్ మండలం(జి)హు క్రేన్ శివారులో 60 ఎకరాలు,నాగల్ గిద్ద మండలం 20 ఎకరాలు, జడ్చర్లలో 30 ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేశారు. అమాయకులకు మోసం చేసి అంటగట్టడంతో, ఎవరి ప్లాట్లు ఎక్కడుందో తెలవక తికమకపడి మోసపోతున్నారు. ఋగ్వేద ఇన్ఫ్రా డెవలప్మెంట్: నాగల్ గిద్ద మండలం గంగారం తాండ లోన్ 10 ఎకరాలు , కుబాతాండలో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి కొనుగోలు చేసినప్పుడు ప్లాట్లు వేసినప్పటికీ డబుల్యూ రిజిస్ట్రేషన్ చేయడంతో వినియోదారులకు తెలియడంతో కొనలేకపోతున్నారు.
10 శాతం రిజర్వ్ స్థలాలు మాయం..
ఎక్కడైనా వెంచర్లు వేస్తే వెంచర్ పూర్తి విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజాప్రయోజనాల కోసం కేటాయింపు చేయాలి. ఎకరం భూమి లక్షలు పలుకుతుండడం, అంకణం విలువ లక్షలు పలుకుతుండడంతో అక్రమంగా వెలుస్తున్న లేఅవుట్ల రిజర్వు స్థలాలు అన్నవి ఎక్కడ కూడా కనిపించడం లేదు. రిజర్వు స్థలాలు కేటాయింపు చేస్తున్నట్లుగా చూపిస్తూ ఆ తర్వాత వాటిని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేస్తున్నారు. 10 శాతం రిజర్వ్ స్థలాలపై పంచాయతీ పాలకులు, అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే ఇక్కడ పదుల సంఖ్యలో ఎకరాల భూమి పంచాయతీకి అస్తిగా ఏర్పడుతుంది. రిజర్వ్ స్థలాలు పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా వెంచర్ లోని అన్ని ప్లాట్లు కనీసం నిబంధనలు కూడా పాటించకుండా అమ్మేస్తున్న తీరుతో పంచాయతీకి వచ్చే కోట్ల ఆస్తికి సైతం గండి పడుతుందన్నది అధికారుల గుర్తించడం లేదు.






