- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 459 కోట్లు తాగేశారు..!
మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో డిసెంబర్ ఒక్క నెలలోనే అమ్మకాలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు ఫుల్ కిక్కును ఇచ్చాయి.

రూ. 459 కోట్లు తాగేశారు..!
ఇది ఒక్క డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల లెక్క
31న ఒక్క రోజే రూ.21.36 కోట్ల మద్యం విక్రయం
ఉమ్మడి మెదక్ జిల్లా లిక్కర్ సేల్స్ నయా రికార్డ్
అత్యధికంగా సంగారెడ్డిలో రూ.224 కోట్లు
సిద్దిపేటలో రూ.144 కోట్లు
మెదక్ లో రూ.90 కోట్లకు పైగా అమ్మకాలు
గతేడాది కంటే రూ.100 కోట్లకు పైగా అధిక అమ్మకాలు
దిశ, సంగారెడ్డి బ్యూరో: మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో డిసెంబర్ ఒక్క నెలలోనే అమ్మకాలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు ఫుల్ కిక్కును ఇచ్చాయి. కేవలం డిసెంబర్ నెలలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో 249 వైన్స్ ల నుంచి మందు బాబులు రూ.459.07 కోట్ల మద్యాన్ని తాగేశారు. అందులో ఒక డిసెంబర్ 31 రోజు మూడు జిల్లాలలో కలిపి రూ.21.36 విక్రయాలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికలతో పాటు నూతన సంవత్సర వేడుకలు అబ్కారీ ఆదాయాన్ని పరుగులు పెట్టించి ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చింది. రికార్డ్ స్థాయి అమ్మకాలతో నయా రికార్డ్ ను సృష్టించింది.
అమ్మకాల్లో సంగారెడ్డి జిల్లానే టాప్..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రూ.459.07 కోట్ల అమ్మకాలు జరుగగా, ఇందులో ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే రూ.224.06 కోట్ల మద్యం అమ్మకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత సిద్దిపేట జిల్లాలో రూ.144.76 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.90.24 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. 2024 డిసెంబర్ నెల అమ్మకాలతో పోల్చితే మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగా యి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు అనుకు ని ఉండడంతో రియల్ వ్యాపారం, ఐటీ ఉద్యోగుల అధికం గా ఉన్న పటాన్ చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగాయి. ఈ నెలలోనే స్థానిక సర్పంచ్ ఎన్నికలతో పాటు న్యూ ఇయర్ వేడుకలు కలిసి రావడం తో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
2024 డిసెంబర్ కంటే
రూ.117కోట్ల అధిక అమ్మకాలు..
2024 డిసెంబర్ నెలలో ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రూ.341.30 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ 2025 డిసెంబర్ లో అమ్మకాలు రూ.117.77 కోట్లు మేరకు పెరిగి రూ.459.07 కోట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డును సృష్టిస్తూ సర్కార్ ఆదాయాన్ని దండిగా పెంచింది.2024 డిసెంబర్ నెలలో లో సంగారెడ్డి జిల్లాలో రూ.164.89 కోట్లు, సిద్దిపేట లో రూ.117.86 కోట్లు,మెదక్ జిల్లాలో రూ.58.54 కోట్ల లిక్కర్ దందా జరిగింది. 2025 డిసెంబర్ లో శాతల వారిగా తీసుకుంటే అత్యధికంగా మెదక్ జిల్లా అమ్మకాల పెరుగుదల 54.15% నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా 35.88 శాతం, సిద్దిపేట లో 34.51 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. టర్నోవర్ పరంగా సంగారెడ్డి జిల్లా టాప్ లో ఉండగా, పర్సెంటేజీ పరంగా మెదక్ జిల్లా భారీ అమ్మకాలను నమోదు చేసింది.
ఒక్క రోజే రూ.21.36 కోట్ల మద్యం..
2025 డిసెంబర్ నెలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రికార్డ్ మద్యం అమ్మకాలు నమోదు కాగా డిసెంబర్ 31 ఒక్క రోజే రూ.21.36 కోట్ల అమ్మకాలు జరిగాయి.ఒక సంగారెడ్డి జిల్లాలో రూ. 10.37 కోట్ల అమ్మకాలు జరుగగా, సిద్దిపేట లో రూ.7.44 కోట్లు, మెదక్ లో రూ.3.64 కోట్ల మద్యం విక్రయాలు నమోదు అయ్యాయి. నూతన సంవత్సర సంధర్బంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగిన అమ్మకాల్లో ఒక్క సంగారెడ్డి జిల్లా మద్యం ఏరులై పారి విక్రయాలు 50 శాతాన్ని ఆక్రమించి నయా రికార్డ్ ను సృష్టించింది. ఈ అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ రాబడి రాగా, మందు ప్రియుల జేబులు ఖాళీ అయ్యాయని చెప్పవచ్చు. రికార్డు అమ్మకాలతో భారీ ఆదాయం సమకూరడంతో ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ అధికారులు సంతోషంలో మునిగిపోయారు.






