వర్షాల కోసం ఈద్గాలో సలాతుల్ ఇస్తిస్కా ప్రత్యేక నమాజ్

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వర్షాల కోసం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వర్షాల కోసం ఈద్గాలో సలాతుల్ ఇస్తిస్కా ప్రత్యేక నమాజ్
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వర్షాల కోసం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జమైతుల్ ఉల్మా జహీరాబాద్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఈద్గా మైదానంలో శనివారం సలాతుల్ ఇస్తిస్కా ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలకు కరువు కష్టాలు తొలగాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు భగవంతుడిని ఎక్కువగా స్మరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక ప్రార్థనలు మరో రెండు రోజులు ఆదివారం, సోమవారం కూడా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Next Story