- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.3 కోట్లతో ఉబ్బ చెరువు వద్ద డ్రైనేజీ ప్రత్యేక పైప్ లైన్..
ఉబ్బ చెరువు వద్ద డ్రైనేజీ వాటర్ చెరువులో కలవకుండా రూ.3 కోట్లు వెచ్చించి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.

దిశ, సదాశివపేట: ఉబ్బ చెరువు వద్ద డ్రైనేజీ వాటర్ చెరువులో కలవకుండా రూ.3 కోట్లు వెచ్చించి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. సదాశివపేట పట్టణంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అమృత్ 2ఓ లో భాగంలో సుమారు రూ. 3 కోట్లతో ఉబ్బ చెరువు వద్ద డ్రైనేజీ వాటర్ చెరువులో కలవకుండా పైప్ లైన్ వేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సదాశివపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిర్మల ప్రారంభించారు. అలాగే ఫయాజ్‌నగర్‌లోని నూతన ట్రాన్స్ఫారం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధన్న, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పట్లూరి నాగరాజు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు వాజిద్, దుబాయ్ వాజిద్, సజ్జు బాయ్, నర్సింలు మున్సిపల్ కమిషనర్ శివాజీ, మున్సిపాల్ ఇంజనీర్ రాజేష్, కో ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.






