సొసైటీ సొమ్ము స్వాహా.. అనర్హులకు అడ్డగోలు రుణాలు!

by Geesa Chandu |

సిర్గాపూర్ మండలం పరిధిలోని బొక్కస్ గాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు గాంచింది.

సొసైటీ సొమ్ము స్వాహా.. అనర్హులకు అడ్డగోలు రుణాలు!
X

దిశ, నారాయణఖేడ్: సిర్గాపూర్ మండలం పరిధిలోని బొక్కస్ గాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు గాంచింది. కానీ ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయింది. పీఏసీఎస్ చైర్మన్ , డీసీసీబీ డైరెక్టర్ ఒక్కరే కానీ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రైతుల ప్రమేయం లేకుండా రైతు పేరిట రాణి మైహిపాల్ రెడ్డి పేరిట రూ.5.56 లక్షలు, రైతు లక్ష్మీనారాయణ పేరిట కూడా రూ.3లక్షలు, రుణాలు తీసుకున్నట్లు బహిర్గతమైంది. ఇంకా ఎంతమంది రైతుల పేరిట బోగస్ రుణాలు ఇచ్చారో అని పాలకవర్గ సభ్యులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీసీవోకు ఫిర్యాదు చేశారు. వడ్ల, జొన్నలు డబ్బులు రైతుల ఖాతాలో వేయకుండా వారికి అనుకూలంగా ఉన్న వారి ఖాతాలో వేసుకున్నారు. పెట్రోల్ బంకును నిర్మించకుండానే రూ.10 లక్షలు డ్రా చేశారు. హమాలీల కోసం రూ.70 నుంచి రూ.80 వరకు వసూలు చేసి రూ.40 మాత్రమే హమాలీలకు ఇచ్చారు. రైస్ మిల్లులతో కుమ్మకై ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఇవ్వకుండా రూ.1600 చొప్పున ఇచ్చి రైతులను మోసం చేశారు. గతంలో 20‌‌–21 సంవత్సరంలో ఎస్​ బీఐ బ్యాంకు నుంచి డీసీసీ బ్యాంకు మార్చే సమయంలో రూ.20 లక్షలు స్వాహా చేశారు. రైతు రుణమాఫీ కోసం డాక్యుమెంట్లు చార్జి అంటూ 1200 వసూలు చేస్తున్నారు. ఈ సొసైటీలో ప్రతి పనిలో అవినీతిలో మునిగిపోయింది. ఇంత జరుగుతున్నా సహకార శాఖకు సంబంధించిన అవకతవకలపై ఎందుకు పట్టించుకోకపోవడం లేదని పలువురు రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

సిర్గాపూర్ మండలం డైరెక్టర్ పరిధిలోని పీఏసీఏస్ పరిధిలో బొక్కస్ గాం తోపాటు అంతర్ గాం , సుల్తానాబాద్, చిన్న ముబారక్ పూర్ , పెద్ద ముబారక్ పూర్, గరిడేగాం గ్రామాలు ఉన్నాయి.1380 మంది సొసైటీ సభ్యులు ఉన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీని పాలకవర్గం స్వాహా కేంద్రoగా మార్చింది. సొసైటీని పటిష్ట పరుస్తూ ప్రగతిపత్రంలో నడిపించేందుకు ఎన్నుకున్న పాలకవర్గం, అది పక్కనపెట్టి సొసైటీ సొమ్మును పంచుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పథకం ప్రకారం సొసైటీ నిధులను పక్కదారి పట్టిస్తూ ప్రశ్నించాలని చూసిన సభ్యులను ప్రలోభాలకు గురి చేశారు. వారు ససెమీరా అనడంతో అభివృద్ధి అంటూ ఓవైపు రుణం పేరుతో మరోవైపు అక్రమాలకు తెరలేపి అందినకాడికి దండుకున్నారు. సిర్గాపూర్ మండలం బొక్కస్ గాం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో బొక్కస్ గాం కు చెందిన రైతు ప్రమేయం లేకుండా జర రాణి మహిపాల్ రెడ్డి రూ. 5.56 లక్షలు , లక్ష్మి నారాయణ పేరిట కూడా రూ.3 లక్షలు తీసుకున్నట్లు బహిర్గతమైంది. ఇంకా ఎంతమంది రైతుల రైతుల పేరిట బోగస్ రుణాలు ఇచ్చారో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే, ఎలాంటి పత్రాలు ఇవ్వకుండానే రుణం తీసుకున్నట్లు రుణ ఖాతాలో వెల్లడైందని అయితే ఇంత పెద్ద రుణ సహాయం తాను పొందలేదని, తన ఖాతాలో ఆ డబ్బు జమ కాలేదని జర రాణి మైహిపాల్ రెడ్డి,జర రాణి లక్ష్మీనారాయణ పేరిట తీసుకున్నట్లు చూపిస్తుంది. సొసైటీలో అధికారులు ఇష్ట రాజ్యంగా దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు ఉందని, ఈ విషయమై ఉన్నంత అధికారులు స్పందించే విచారణ చేసి కారకులైన వారికి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, డీ సీ వో కోరారు.అనుచరులు అన్హారులకు అందిన కాడికి రుణాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశారు. నూతన నిర్మాణాల పేరుతో నిధులన్నీ పక్కదారి పట్టించి పంచుకున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు వత్తాసు పలుకుతున్నారు. అంటూ పాలకుల పాపంతో పాలు పంచుకోవడం తో పదేళ్లుగా ఆ సొసైటీలో అక్రమాలు అడ్డు అదుపు లేకుండా సాగాయి. తీగలాగితే డొంక కదిలిన చందంగా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ బొక్కస్ గాం సహకార పరపతి సంఘం ప్రతిష్టను ప్రశ్నార్థకంగా మార్చాయి.

సంగారెడ్డి జిల్లాలో సిర్గాపూర్ బొక్కస్ గాం సొసైటీ పేరుగాంచిన వ్యవసాయ సహకార పరపతి సంఘం బొక్కస్ గాం సొసైటీ ప్రత్యేక స్థానం. ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా సాగిన చరిత్ర ఈ సొసైటీ. తిరిగేస్తే గత 10 ఏళ్లుగా ఈ సొసైటీ అడ్డు అదుపులేని అక్రమాలకు అడ్డగా మారింది. అయితే గతంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలకు పాలకవర్గ చైర్మన్ కు సన్నిత సంబంధాలు కలిగి ఉండడం చేత ఎటువంటి అవకతవకలు జరిగిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. పాలక వర్గంలో కొంతమంది సభ్యులు ప్రశ్నించిన అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు.

-పక్క పథకం ప్రకారమే పక్కదారి...

పక్క పథకం ప్రకారం నిధులను పక్కదారి పట్టించారు. అయితే 10 ఏళ్లుగా యథేచ్చగా సాగిన అక్రమాలు ప్రభుత్వం మారడంతో చెక్ పడ్డట్టయింది. గత ఎన్నికల్లో ఫలితాలు తారు మారై ప్రభుత్వం మారింది. పాలన పద్ధతి మారింది. 2020 నుంచి 20 21 సంవత్సరంలో ఎస్బిఐ బ్యాంకు నుంచి డిసిసి బ్యాంకు మార్చే సమయములో రూ.20 లక్షలు స్వాహా చేశారని అప్పట్లో సభ్యులు ఆరోపించారు.

పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం రూ.10లక్షలు డ్రా చేసినట్లు ఉంది కానీ ఎక్కడ నిర్మించలేదు. మండలంలోని అంతర్గం లో రూ.40 లక్షలతో 50 మెట్రిక్ టన్నుల గోదాం నాణ్యత లేకుండా నిర్మించారు. 35 వేల క్వింటాళ్ల జొన్నల కొనుగోలులో రెండు మూడు కిలోల తరుగు పేరిట దోపిడీ చేశారు. వరి 20 వేల క్వింటాళ్ల మూడు కిలోల తరుగు పరుగు తీసి రైతులకు మోసం చేశారు. రైస్ మిల్ తో కొమ్ముకై సొసైటీని తప్పించి వరి ఒక క్వింటాల్ కు రూ.1600 చొప్పున అమ్మి రైతు ఖాతాలో జమ చేసినారు.హమాలి కోసం ఒక్కొక్కరి వద్ద 70 నుంచి 80 వరకు వసూలు చేసి 40 రూపాయలు మాత్రమే హమాలీలకు ఇచ్చారు. సీడు ధాన్యం కొనుగోలు, అమ్మకాలు, హమాలీ, తరుగు, అధికతుకం బస్తకు రెండు నుంచి మూడు తీశారు. వడ్డీ వాటదానం, రుణాల రికవరీ, సీటు ధాన్యం, కొనుగోలు, అమ్మకాలు, హమలీలుతరుగు, సీడు రిజేక్షన్, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు, బార్ దాన్, సుతిలి, వడ్ల తాలు తరుగు, అధికతుకం అవినీతి జరిగినట్లు సమాచారం. వ్యవసాయ భూమి లేని వారికి సంఘం సభ్యుల నుంచి రుణాలు మంజూరు చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు కూడా రుణాలు ఇచ్చారని, ఇచ్చిన డబ్బులు రికవరీ చేయడంలో నిర్లక్ష్యం వహించారు. రైతులకు రుణమాఫీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తే ప్రతి రైతు వద్ద డాక్యుమెంట్ చార్జి అంటూ 1200 వసూలు చేస్తున్నారు. సర్వసభ్య సమావేశం పెట్టి, చర్చలు జరిపి తే ఇవన్నీ సమస్యలు తెలిసేవి కానీ , ఏనాడు కూడా ఈ సమస్యల పైన చర్చలు జరగలేదు. అవకతకాలు జరిగిన అటువంటి కి రైతులు ఏమైనా సమస్యల కోసం వస్తే రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. ఖాతాదారులకు కాకుండా వాళ్లకు సంబంధించిన ఖాతాలోకి డబ్బులు పంపుకున్నారు.

-స్థానికంగా చర్చనీయాంశం

అయితే విషయం స్థానిక చర్చనీయంగా మారింది. ఫిర్యాదు ఇచ్చి 15 రోజులు గడిచిన తర్వాత మేల్కొన్న సహకార శాఖ అధికారులు అక్రమాలను గుర్తించడంసరే మరి ఏ చర్యలు ఏ విధంగా ఉంటాయనేదానిపై ఆసక్తికరంగా మారింది. అయితే 10 ఏళ్లలో అక్రమాలు జరిగాయoటూ ఆరోపణలు రావడం, ఆపై అధికారులు షరా మామూలే అన్నట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలు రేకేత్తిస్తుంది. అయితే సహకార శాఖకు సంబంధించిన అవకతోకల గురించి ఎందుకు పట్టించుకోకపోవడం లేదని పలు రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Next Story