- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీడీఎస్ కార్యాలయంలో పాము కలకలం...
by Taduka Kalyani |
అల్లాదుర్గం మండల ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. ఉదయం కార్యాలయం తెరిచి లోపలికి వెళ్లిన సిబ్బందికి పాము కనిపించడంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు.

X
దిశ, అల్లాదుర్గం : అల్లాదుర్గం మండల ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. ఉదయం కార్యాలయం తెరిచి లోపలికి వెళ్లిన సిబ్బందికి పాము కనిపించడంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు. తీరా ఆ పాము అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే చిన్నారుల దుస్తుల కట్టల్లోకి వెళ్లిపోయింది. దీంతో సిబ్బంది కొంత సేపటికి దుస్తుల కట్టలను కర్ర సహాయంతో కదిలించడంతో పాము కార్యాలయం లోంచి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు సిబ్బంది కాస్త ఊపిరిపీల్చుకున్నారు. కార్యాలయం పక్కకు పొదలు ,చెట్లు ఉండడంతో పాము వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story






